కాఫీ శుద్ధి కర్మాగారం పనులను ప్రారంభించాలి
NEWS Sep 04,2024 04:27 pm
సమీకృత కాఫీ శుద్ధి కర్మాగారం పనులను వెంటనే ప్రారంభించి కర్మాగారం నిర్మాణం పూర్తి చేయాలని భారతీయ ఆదివాసుల సమాఖ్య అధ్యక్షుడు రామగోపాల్ కోరారు. మీడియాతో మాట్లాడుతూ గిరిజన రైతులు పండిస్తున్న కాఫీని గత కొన్ని సంవత్సరాల నుండి గిరిజన సహకార సంస్థ కొనుగోలు చేస్తూ అరకు కాఫీ పేరిట దానిని దేశీయంగా, అంతర్జాతీయంగా అమ్మకాలు చేస్తూ లాభాలు పొందుతోందన్నారు.