కొత్త విద్యుత్ లైన్ మంజూరు
NEWS Sep 04,2024 04:20 pm
అల్లూరి జిల్లా, హుకుంపేట మండలంలోని, భీమవరం పంచాయితీ, గంగరాజు పుట్టు - కొంకోడి బంధ గ్రామానికి కొత్త విద్యుత్ లైన్ మంజూరైందని హుకుంపేట వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గంగరాజు పుట్టు-కొంకోడి బంధ వీధి లైన్ తుప్పు పట్టి వైరులన్నీ తెగిపడ్డాయని, సమస్యను, జన్ని లచ్చన్న ద్వారా తెలుసుకుని, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఐటీడీఏ పీఓ అభిషేక్ ల దృష్టికి తీసుకెళ్లగా స్పందించి, వెంటనే అర కిలో మీటర్ కు సరిపడ విద్యుత్ లైన్ కు కొత్తలైను మంజూరు చేసారన్నారు.