ఉపాధ్యాయులకు ఆటల పోటీలు
NEWS Sep 04,2024 04:28 pm
డుంబ్రిగూడ: ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని డుంబ్రిగూడ మండలం, కిల్లోగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆటల పోటీలు నిర్వహించారు. ఈ ఆటల పోటీల్లో భాగంగా ఉపాధ్యాయులకు వాలీబాల్, చెస్, క్యారమ్స్, మ్యూజికల్ చైర్, లెమన్ అండ్ స్పూన్, క్రికెట్ ఆటలను ఆడిపించారు. ఈ ఆటలలో హెచ్ఎం నాగేష్, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.