వరద బాధితుల సహాయార్థం చిన్నారి సాయం చేసింది. డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం శ్రీరాంపురంలో నివసిస్తున్న మట్టపర్తి రాము (దస్తావేజు లేఖరి) ఆయన కుమార్తె లక్ష్మీ కార్తీక సౌందర్య విజయవాడ వరద బాధితుల సహాయార్థం 20 వేల రూపాయల చెక్కును ఏపీ సీఎం సహాయ నిధి కోసం అమలాపురం కలెక్టరేట్లో కలెక్టర్‌ను కలిసి అందించారు. చిన్నారిని కలెక్టర్ అభినందించారు.