ఎన్నికల హామీలు అమలు చేయాలని వాలంటీర్స్ డిమాండ్
NEWS Sep 04,2024 04:24 pm
అరకు: అరకులోయ మండలంలోని వివిధ సచివాలయల వాలంటీర్స్ భవిష్యత్తు కార్యాచరణకై వాలంటీర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో అరకులోయలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. బకాయి వేతనం చెల్లించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ జానిబాబు, రాజబాబు, వాలంటీర్స్ పాల్గొన్నారు.