మహేష్, క్యూఆర్టి టీంకు ఎస్పీ అభినందనలు
NEWS Sep 04,2024 04:48 pm
టేక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధి గుండు వాగులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్ మహేష్, క్యూఆర్టి టీంను ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అభినందించారు. ప్రాణాలను పణంగా పెట్టి సాహసోపేతంగా వ్యక్తిని కాపాడడం అభినందనీయమన్నారు. వ్యక్తిని కాపాడిన మహేష్, క్యూఆర్టి టీమును అభినందించి నగదు రివార్డును అందజేశారు. అడిషనల్ ఎస్పీ మహేందర్, అధికారులు పాల్గొన్నారు