కేజీబీవీల ఔట్ సోర్స్ జేఎల్స్,
సిఆర్టీల సమస్యల పరిష్కారానికి వినతి
NEWS Sep 04,2024 03:21 pm
అరకు: కేజీబీవీల ఔట్ సోర్స్ JLs, CRTల సమస్యల పరిష్కారం చేయాలంటూ టీడీపీ అరకు పార్లమెంటు అధ్యక్షులు కిడారి శ్రావణ్ కుమార్ కు వినతి పత్రం ఇచ్చారు. పాడేరు డివిజన్ లోని కేజీబీవీలలో ఔట్ సోర్స్‌లో పనిచేసిన ఆరుగురు JLs, నలుగురు CRT లను ఇప్పటి వరకు ఉద్యోగంలోకి తీసుకోలేదన్నారు. ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. శ్రావణ్ స్పందిస్తూ సమస్యను మంత్రి లోకేష్ దృష్టిలో పెట్టి పరిష్కారానికి కృషిచేస్తానని భరోసా ఇచ్చారు.