పండగలు ప్రశాంతంగా నిర్వహించండి
NEWS Sep 04,2024 03:30 pm
భైంసా పట్టణంలోని గణేష్ నగర్ మున్నూరుకాపు సంఘంలో గణేష్ మండపాల సభ్యులతో, గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో జిల్లా ఎస్పీ జానకీ షర్మిల సమావేశం నిర్వహించారు. వినాయక చవితి, దసరా పండుగలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని గణేష్ మండపాల సభ్యులకు ఎస్పీ సూచించారు. పండుగల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్న అధికారులకు తెలపాలని కోరారు.