గడ్డెన్న వాగు ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తివేత
NEWS Sep 04,2024 03:33 pm
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భైంసా మండలంలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 358.70 మీటర్లు కాగా ప్రస్తుతం 358.50 మీటర్లు ఉంది.ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లోగా 13,611 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా 2 గేట్లు ఎత్తి 20,330 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు.