కార్యకర్తలు సభ్యత్వాలు చేయించాలి
NEWS Sep 04,2024 03:36 pm
అమలాపురం పట్టణంలో బీజేపీ సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణ రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం పాల్గొన్నారు. ప్రతి బూత్ స్థాయిలో ప్రతీ కార్యకర్త సభ్యత్వాలు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోన సత్యనారాయణ, జి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.