మట్టి గణపతులు పూజించాలి
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
NEWS Sep 04,2024 04:29 pm
పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పూజించాలనే పోస్టర్లను జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసే విగ్రహాలు నీటిలో కరగడానికి చాలా సంవత్సరాలు పడుతుందని తెలిపారు.