కృతజ్ఞతలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
NEWS Sep 04,2024 12:57 pm
తెలంగాణలో వరదల నేపథ్యంలో సీఎం సహాయ నిధికి పలువురు సెలబ్రిటీలు విరాళాలు అందించారు. ప్రభాస్ 1 కోటి, పవన్ 1 కోటి, చిరంజీవి - రామ్ చరణ్ చెరో 50 లక్షలు, అల్లు అర్జున్ 50 లక్షలు, సీఎం చంద్రబాబు అర్ధాంగి భువనేశ్వరి 1 కోటి, వైజయంతీ మూవీస్ 20 లక్షలు, సిద్ధు జొన్నలగడ్డ 15 లక్షలు, సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఎన్వీ రమణ 10 లక్షలు విరాళాలు అందించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ విరాళాలు ప్రకటించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.