పిల్లల ఎత్తు, బరువు కొలవాలి
NEWS Sep 04,2024 03:23 pm
అంగన్వాడి కేంద్రాల్లో పిల్లల ఎత్తు, బరువు తప్పనిసరిగా కొలవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా రుద్రంగిలోని 6 అంగన్వాడి కేంద్రాలను ఒక చోట చేర్చి, వీహెచ్ ఎస్ఎన్ లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై వివరించారు. ఈ సందర్భంగా పిల్లల ఎత్తు, బరువు ఆధారంగా పోషకాహారం ఇవ్వాలని సూచించారు. పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.