బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల
నెల జీతం విరాళం: హరీశ్ రావు
NEWS Sep 04,2024 12:13 pm
రాష్ట్రంలో వరద బాధితులకు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు విరాళం ప్రకటించారు. ఈ మేరకు X వేదికగా ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రకటించారు. వరద బాధితులను ఆదుకోవాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించారని, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వరదల వల్ల ఇబ్బందిపడుతున్న ప్రజలకు బీఆర్ఎస్ పక్షాన సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.