సిరిసిల్ల: వరద బాధిత ప్రజలను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు బృందంపైన కొందరు కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం సిగ్గు చేటు అని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఖమ్మం ప్రజలకు అండగా నిలిస్తే దాడులు చేయడం పిరికిపందల చర్య అని విమర్శించారు.