అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా సభ్యులు అరెస్ట్
NEWS Sep 04,2024 04:32 pm
శ్రీసత్యసాయిజిల్లా: ఐదుగురు అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రత్న తెలిపారు. హిందూపురం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఎస్పీ మాట్లాడుతూ.. త్రిపుర నుంచి బెంగళూరుకు గంజాయి సరఫరా చేస్తున్న క్రమంలో హిందూపురం రూరల్ మండలం గోళాపురం ఇండస్ట్రీ ఏరియాలో విక్రయిస్తూ పట్టుబడినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 7 కేజీల గంజాయి, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.