శాంతియుతంగా గణేష్ ఉత్సవం
జరుపుకోవాలి: ఎస్పీ రత్నశాంతి
NEWS Sep 04,2024 12:25 pm
శ్రీసత్యసాయిజిల్లా: హిందూపురం పట్టణంలో వినాయక చవితి పండుగ ఉత్సవాలపై మత పెద్దలతో, విగ్రహ ఉత్సవ కమిటీ సభ్యులతో ఎస్పీ రత్నశాంతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పండుగను భక్తిశ్రద్ధలతో, శాంతి భద్రతల నడుమ జరుపుకునేందుకు అందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మహేష్, తదితరులు పాల్గొన్నారు.