ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించారు. బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా రూ.6 కోట్లు విరాళం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంఆర్‌ఎఫ్‌లకు చెరో రూ. కోటి చొప్పున పవన్ విరాళం ప్రకటించారు. ఏపీలోని 400 పంచాయతీలకు రూ.4 కోట్లు ఇవ్వనున్నారు. ఒక్కో పంచాయతీకి రూ.లక్ష చొప్పున విరాళం ప్రకటించారు.