జిల్లా ప్రజలకు ఎస్పీ అఖిల్ సూచనలు
NEWS Sep 04,2024 11:31 am
ప్రజలు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారని, మల్టీ లెవల్ మార్కెటింగ్ ల పేరుతో మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు అంటూ మోసపూరిత ప్రచారాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈజీ మనీ ఆశలో పడి మోసపోవద్దని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే సైబర్ ట్రోల్ ఫ్రీ నంబర్ 1930 కి ఫిర్యాదు చేయాలని తెలిపారు.