ORR పరిధిలోని 51 గ్రామాలు
మున్సిపాలిటీల్లో విలీనం
NEWS Sep 04,2024 09:26 am
HYD: ఓఅర్ఆర్ పరిధిలోని 51 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులతో ఈ నిర్ణయం తీసుకుంది. ఓఆర్‌ఆర్ పరిధిలోని 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు గ్రామాలు విలీన జాబితాలో ఉన్నాయి.