ఘనంగా రమణ జన్మదిన వేడుకలు
NEWS Sep 04,2024 12:27 pm
జగిత్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ శ్రేణులు. జిల్లా కేంద్రంలోని శ్రీ మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. మరోవైపు జిల్లా కేంద్రంలోని వాల్మీకి ఆవాసంలో పేద విద్యార్దులకు అన్నదానం నిర్వహించి పండ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.