బూర్జ మండలం లక్కుపురం పంచాయతీ పరిధిలోని పనుకుపర్త ఎస్సీ కాలనీ శివారున ఉన్న మంచినీటి బోరు గత రెండు నెలలుగా పనిచేయట్లేదని కాలనీ వాసులు తెలుపుతున్నారు. పలుమార్లు పంచాయతీ అధికారులు దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేదన్నారు. స్థానిక సర్పంచ్ తక్షణమే స్పందించి మంచి నీటి బోరు మరమ్మతులు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.