హైడ్రా పేరుతో వసూళ్లు - అరెస్టు
NEWS Sep 04,2024 11:34 am
హైడ్రా పేరుతో భయాందోళనకు గురిచేస్తూ డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న నిందితుడిని టాస్క్ ఫోర్స్, అమీన్ పూర్ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ రూపేష్ సంగారెడ్డిలో విలేకరులకు వివరాలు అందజేశారు. అమీన్పూర్ లో నివాసముండే ఖమ్మం పట్టణానికి చెందిన ఫిజియోథెరపీ డాక్టర్ బండ్ల విప్లవ్ సిన్హా హైడ్రా పేరుతో విల్లా నిర్మాణ సంస్థ నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడుతుండగా పట్టుకున్నారు