ప్రజలకు మంత్రి పొన్నం సూచనలు
NEWS Sep 04,2024 04:46 pm
ప్రకృతి విలయ తాండవం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు. ప్రభుత్వం తరుపున సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్యాబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ మొత్తం పునరావాస కార్యక్రమాల్లో నిమగ్నమై ఉందని, ప్రజలకు అండగా ఉండే బాధ్యత గల ప్రభుత్వంగా తాము అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నామని, ప్రకృతి విపత్తును అపగలిగే శక్తి ఎవరికీ లేదన్నారు.