అనంతపురం జిల్లా కుందుర్పి మండలం ఎనుములదొడ్డి గ్రామ పరిధిలో బుధవారం వింత ఘటన చోటుచేసుకుంది. వేప చెట్టుకు పాల లాంటి ద్రవం కారుతుండటంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. అక్కడి ప్రజలు ఈ వింతను చూడటానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా వేప చెట్టు నుంచి పాల లాంటి ద్రవం కారడానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణమని వృక్ష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీన్ని అగ్రోబ్యాక్టీరియం ట్యూమెఫేసియన్స్ అంటారు.