13న అంజన్న తలనీలాల టెండర్లు
NEWS Sep 04,2024 06:57 am
కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారికి భక్తులు సమర్పించే తలనీలాలను ప్రోగు చేసుకునే హక్కు కోసం ఏడాది పాటు కాలపరిమితి కలిగిన టెండర్ ప్రక్రియను ఈ నెల 13న హైదరాబాదులోని ఎండోమెంట్ ప్రధాన కార్యాలయంలోని ధ్యాన మందిరంలో మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఫిబ్రవరిలో నిర్వహించిన అత్యధిక హెచ్చు పాటగా నిలిచిన రూ,1.62కోట్లు నుండి పాట ప్రారంభించబడుతుందని ఆలయ ఈవో రామకృష్ణారావు తెలిపారు.