మట్టి వినాయక ప్రతిమల పంపిణీ
NEWS Sep 05,2024 07:56 am
అరకు: జలవనరులు కలుషితం అవకూడదని ఆరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల NSS విభాగం మట్టి వినాయక ప్రతిమలను విద్యార్ధులకు పంపిణీ చేశారు. రసాయనాలతో చేసిన ప్రతిమలతో జలవనరులకు, పర్యావరణానికి హాని కలుగుతుందని ప్రిన్సిపాల్ కెబికె నాయక్ తెలిపారు. విద్యార్ధులు తమ గ్రామాల్లో మట్టి వినాయక ప్రతిమలతో కలిగే ఉపయోగాలను వివరించి, గ్రామస్తులతో మట్టి వినాయక ప్రతిమలను పూజించే విధంగా చేయాలని NSS P.O లు నాగబాబు, విజయలక్ష్మి, అనితకుమారి కోరారు.