విజయసాయిరెడ్డి కుమార్తెకు షాక్
NEWS Sep 04,2024 06:05 am
భీమిలి తీరంలో సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్దంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి నిర్మించిన అక్రమ కట్టడాలను GVMC అధికారులు కూల్చివేశారు. భీమిలి జోన్ సహాయ ప్రణాళిక అధికారి బి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉదయం నుండి బీచ్ ఒడ్డున హోటల్ నిర్మాణం కోసం వేసిన కాంక్రీట్ పిల్లర్స్, గోడలు ఇతర నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఇక్కడి అక్రమ నిర్మాణాలపై జనసేన నేత మూర్తి యాదవ్, మరి కొందరు కూటమి నేతలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.