సీతాఫలం రైతుల ఆవేదన
NEWS Sep 04,2024 06:58 am
పాడేరు మండలం వంటల మామిడి, సలుగు, దేవాపురం, ఐనాడ పంచాయతీల గ్రామాల్లో సీతాఫలం ఎక్కువ సాగు చేస్తుంటారు. ఈ ఏడాది తొలి వారంలో సీతాఫలం ధర పలికినప్పటికీ, ప్రస్తుతం కావిడి ధర రూ.1,000 లోపు పడిపోయింది. కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రం నలుమూలల నుంచి వ్యాపారులు రాక, కొనేవారు లేక ధరలు పడిపోయాయి. రవాణా, దింపుడు కూలి ఖర్చులు రావడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.