జగిత్యాలను వణికిస్తున్న విషజ్వరాలు
NEWS Sep 04,2024 05:57 am
జగిత్యాల జిల్లాను విష జ్వరాలు వణికిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో జ్వర పీడితులు ఉండగా, వందల సంఖ్యలో డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇక సారంగాపూర్ మండలంలోని పెంబట్ల, కోనాపూర్, పోచంపేట గ్రామాల్లో ఇంటికో జ్వర పీడితులు ఉన్నారు. ఈ గ్రామాల్లో నెల రోజుల వ్యవధిలో సుమారు 10 మంది వరకు మృతి చెందటంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. వైద్యారోగ్య శాఖ ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినా కూడా విష జ్వరాలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు