మల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన పుల్లల వెంకటమ్మ (82సం) వృద్ధురాలు మంగళవారం ఉదయం ఇంట్లో నుండి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోయేసరికి, వాళ్ళ బంధువులు ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరకకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు.