సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్‌లో ప్రమాదవశాత్తు గొర్రెల షెడ్డుకు షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో బత్తుల మల్లేశం అనే గొర్ల కాపరికి చెందిన 13 గొర్రెలు మృతి చెందాయి. రెండు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు.