అయినవిల్లిలో అతి భారీ వర్షాలు
NEWS Sep 04,2024 06:49 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో బుధవారం తెల్లవారు నుండి భారీ వర్షం కురుస్తుంది. పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు అసౌకర్యంగా మారింది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లు మీద వర్షం నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.