విపత్తులో రాజకీయాలు చేయొద్దు
NEWS Sep 04,2024 06:55 am
విపత్కర సరిస్థితుల్లో బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేయొద్దని మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా 24×7 తమ ప్రభుత్వం, కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు రాజకీయ లబ్ధికోసం విచక్షణలేకుండా మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాలు తిరగబడి చెప్పుతో కొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు.