భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలమయ్యిందని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ అన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఎక్కడ వున్నారని ప్రశ్నించారు. ప్రజలకు భరోసా ఇస్తూ సర్కార్‌కు సలహాలు సూచనలు ఇవ్వాల్సిగానీ కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారని మండిపడ్డారు. ప్రతిపక్ష పాత్ర పోషించకుంటే ఎలా? అంటూ నిలదీశారు. రాజకీయాలను పక్కన పెట్టి సాయం చెయ్యాల్సిన సోయి లేదా అంటూ మండిపడ్డారు. కేసీఆర్ ఏ ఫామ్ హౌస్‌లో పడుకున్నారో ప్రజలు తెలుసుకునే పనిలో ఉన్నారన్నారు.