హైడ్రాలాంటి వ్యవస్థలను జిల్లాల్లోనూ తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలను నేలమేట్టం చేసేందుకు తీసుకొచ్చిన హైడ్రాలాంటి వ్యవస్థను జిల్లాలోనూ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఆయా జిల్లాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తోందని అన్నారు. హైడ్రాపై రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా.. మెజార్టీ ప్రజలు మాత్రం స్వాగతిస్తున్నారని అన్నారు. హైడ్రా ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసిన సంస్థ అని అన్నారు. హైడ్రా సంస్థ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఎక్కడా ఆగలేదని తెలిపారు. రాంనగర్ నాలాపై అక్రమ కట్టడాలను తొలగించడం వల్ల ఈరోజు ముప్పు తప్పిందని అన్నారు.