విజయవాడ నగరంలో 54, 55, 56 డివిజన్లలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఎస్. సవితమ్మ పర్యటిస్తూ వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు సీఎం ఆదేశాల మేరకు మంత్రి సవితమ్మ తనకు అప్పగించిన డివిజన్లలో సుడిగాలి పర్యటన చేశారు. మోకాలు లోతు వరద నీటిలో తిరుగుతూ మూడు డివిజన్ల ప్రజలను కలిశారు. చంద్రబాబు ప్రభుత్వం అండగా ఉందని తెలిపారు. ప్రభుత్వం అందజేసిన ఆహారం, వాటర్ బాటిళ్లను అందించారు.