బాణమతి నెపంతో దాడి.. ఒకరు మృతి
NEWS Sep 04,2024 04:44 pm
మెదక్ జిల్లా టేక్మాల్ మండలం గొల్లగూడెం గ్రామంలో బాణామతి చేస్తున్నారని ముగ్గురిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. బురుజు కింది గంగమ్మ ఇంటికి కొల్చారం మండలం మాందాపూర్ కు చెందిన రాములు, బాలమని నిన్న సాయంత్రం వచ్చారు. అమావాస్య కావడంతో బాణమతి చేస్తున్నారని కాలనీవాసులు ఈరోజు ఉదయం ముగ్గురిని చెట్టుకు కట్టివేసి చితకబాదారు. ఈ ఘటనలో రాములు మృతిచెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జోగపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.