25 kgల గంజాయి - 5గురు అరెస్ట్
NEWS Sep 03,2024 05:49 pm
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జాతీయ రహదారిపై 25 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుంచి వచ్చిన ఒక వ్యక్తి గంజాయి సరఫరా చేస్తుండగా పట్టుకున్నారు. ఈ ఘటన లో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి విడివిడిగా అమ్ముతున్నారని సమాచారం అందడంతో వారిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.