జ్వరాలపై డా. హర్షిత సూచనలు
NEWS Sep 03,2024 04:47 pm
కోరుట్ల పట్టణంలో విపరీతంగా వ్యాప్తి చెందుతున్న వైరల్ జ్వరాల నేపథ్యంలో లిటిల్ స్టార్ పిల్లల హాస్పిటల్ డా. హర్షిత ప్రజలకు కొన్ని ముఖ్యమైన సూచనలు అందించారు. పిల్లల ఆరోగ్యం కాపాడేందుకు, తక్షణ వైద్య సహాయం అందించడం చాలా అవసరం. జ్వరానికి గురైన పిల్లలను వెంటనే సమర్థవంతమైన వైద్య సేవలు అందించాలని చెప్పారు. నిత్యం సురక్షితమైన గోరువెచ్చని మంచినీరు తాగాలి. ఇది జ్వరాలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పారు.