వరదల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల వినియోగదారుల కోసం ఎయిర్‌టెల్ కొన్ని మినహాయింపులు ప్రకటించింది. వినియోగదారులకు అదనంగా 4 రోజుల వ్యాలిడిటీ ఇస్తామని స్పష్టం చేసింది. అన్‌లిమిటెడ్ కాల్స్‌తోపాటు 4 రోజులపాటు రోజుకు 1.5 జీబీ మొబైల్ డేటాను అందించనున్నట్లు పేర్కొంది. ఇక పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల బిల్లు చెల్లింపునకు వారం గడువు పొడిగించింది. ఇంటికి వైఫై కనెక్షన్ ఉన్న వాళ్లకు 4 రోజుల అదనపు వ్యాలిడిటీని కల్పించినట్టు ప్రకటించింది. విపత్తు సమయంలో ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.