LOC మంజూరు చేయించిన ప్రభుత్వ విప్
NEWS Sep 03,2024 04:42 pm
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన బి. కిషన్ అనారోగ్య సమస్యల వలన అత్యవసర చికిత్స అవసరం అయింది. స్పందించిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.. నిమ్స్ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందితో మంచి చికిత్స ఇవ్వాలని కోరుతూ, ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయంగా వెంటనే వైద్య ఖర్చులకు 1 లక్ష 50 వేల రూపాయల మంజూరు చేశారు. అత్యవసర ఆరోగ్య చికిత్స నిమిత్తం ఎల్ఓసి మంజూరు చేయించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.