ఇది బీహార్ గుండా సంస్కృతి
NEWS Sep 03,2024 04:49 pm
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీహార్ గుండా సంస్కృతిని అమల్లోకి తెస్తుందని ఖమ్మంలో మాజీ మంత్రులు, నాయకులపై జరిగిన దాడి దీనికి నిలువెత్తు నిదర్శమని కరీంనగర్ ఎమ్మెల్యే కమలాకర్ విమర్శించారు. విపత్తు కాలంలో చేయూతనివ్వడానికి వెళ్లిన నాయకులు, మాజీ మంత్రులపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు. బాధితులను ఆదుకోవడంలో విఫలమైన నేపథ్యంలోనే తాము రంగంలోకి దిగాల్సి వచ్చిందని, వీటిని స్వాగతించాల్సిన కాంగ్రెస్ జీర్ణించుకోకుండా దాడికి పాల్పడటంప్రజాస్వామ్య విలువలకు పూర్తి వ్యతిరేకంగా ఉందన్నారు.