ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లె గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు ఓ ఎలుగుబంటి బావిలో పడింది. ఎలుగుబంటి అరుపులతో అటువైపు వెళ్తున్నవారు గమనించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు ఓ నిచ్చెనను అందులోకి దించి ఉంచారు. ఆ నిచ్చెన సహాయంతో పైకి వస్తుందని అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాత్రంతా ఆ ఎలుగుబంటి అందులోనే ఉండి పైకి రాలేకపోయింది.