17న విమోచన దినోత్సవ వేడుకలు
NEWS Sep 03,2024 03:38 pm
హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు ఏటా జరిగేలా కేంద్రం నిర్ణయించిందని కిషన్‌రెడ్డి తెలి పారు. సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ లో విమోచన దినోత్సవ వేడుకలకు హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా వస్తున్నట్టు తెలిపా రు. బీజేపీ అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17న ప్రతి గ్రామ పంచాయతీపైన జాతీయ జెండా ఎగుర వేస్తామన్నారు. 1948లో నిజాం లొంగిపోయిన రోజు.. గణేష్ నిమజ్జనం ఒకేరోజు జరిగిందని, మళ్లీ 75ఏళ్ల తర్వాత ఇది రిపేట్ అవ్వడం సంతోషమని కిషన్‌రెడ్డి చెప్పారు.