ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిశీలించిన మంత్రి
NEWS Sep 03,2024 03:08 pm
జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్,పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ లతో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎగువ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారుతుందని, ముంపు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.