అల్లూరి జిల్లా ఎస్పీ ఆదేశాలతో APSSDC, జిల్లా ఉపాధి కార్యాలయం మరియు సీడాప్ కలిసి అరకులోయ RITI లో నిర్వహించిన జాబ్ మేళా విజయవంతం అయింది. ఈ జాబ్ మేళా కు రిజిస్ట్రేషన్ చేసుకున్న 150 మందిలో 52 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికైనట్లు అరకు సిఐ హిమగిరి తెలిపారు. జాబ్ మేళ కు వచ్చి జాబ్ సాధించిన గిరిజన యువత ఎంత దూరమైనా వెళ్లి ఉద్యోగాలు చేసి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సిఐ సూచించారు. జాబ్ మేళా లో జాబ్ సాధించిన గిరిజన యువత అవకాశాలను వినియోగించుకోవాలని డిఎస్డిఓ ప్రశాంత్ అన్నారు