వరద బాధితులకు జగన్ కోటి సాయం
NEWS Sep 03,2024 03:02 pm
వరద బాధితులకు వైఎస్ జగన్ రూ.1 కోటి ప్రకటించారు. తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, కారుమూరి, కురసాల కన్నబాబులతో సమావేశమైన జగన్.. ఆ సాయం ఏ రూపంలో, ఎలా ఇవ్వాలనేది పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విజయవాడలో వరద బాధితులు పడుతున్న కష్టాలను స్వయంగా చూశానని, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శించారు.