మల్యాల మండలంలో గణేష్ నవరాత్రులు వైభవంగా నిర్వహించడానికి భక్తులు సిద్దమయ్యారు. ఈ మేరకు ఆయాచోట్ల యువకులు వినాయకుని కోసం మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ.. వినాయకుడి మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పని సరి అని అన్నారు. అలాగే డీజే అనుమతి లేదన్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనం వరకు మండప నిర్వాహకులు పూర్తి బాధ్యత తీసుకొని ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు.