సిరిసిల్ల జిల్లా: అదుపుతప్పి వాహనం బోల్తా పడిన ఘటన ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లో జరిగింది. కామారెడ్డి వైపు నుంచి వస్తున్న లేలాండ్ వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.